Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
llపల్లవిll
రారే ఏసుని విందులో పాల్గొన
రారే ధన్యులు జనులారా
పునీతులు ఎల్లరు విందును గ్రోలి
పరమున చేరిరి అమరులుగా
llఅ.ప.ll ఓ ప్రభూ రావా నిను చే కొనను
శుద్ధిగ చేయుము నా దేవా
నను కడుగు మయా
హిమము కంటే తెలుపొందు నయాll రారే ll
1.
తండ్రి మాట నెరవేర్చ గ ఏసు
వెలసెను మనుజుడై మహిలోన
తల్లి మరియకు విధేయుడై ప్రభు
మార్గము చూపెను మనుషులకు ll ఓ ప్రభు ll
2.
మరణము పొందిన మన ప్రభు యేసు
మహిమతో లేచెను ఈనాడు
మానవ ప్రేమకు గురుతుగ ప్రభువు
తన దేహంబు నే మన కొసగెll ఓ ప్రభు ll
3.
మానవ పాపము తను భరియించె
కార్చెను రుధిరము నీ కొరకు ll2ll
అపార ప్రేమను చూపుటకు ll ఓ ప్రభు ll