Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తండ్రి కుమార పరిశుద్దాత్ముడు యేసే
ఆది అంతముల దేవదేవుడు క్రీస్తే
హృదయాంతరంగమున ఉదయించే
వెలిగే జ్యోతీ ఆ ప్రభువే ||తండ్రి||
1. తంబుర సితార నాదముతో
సద్గ్రంధ సువార్త సునాదముతో ||2||
సద్భక్తి రక్తితో - సద్భావముతో
సద్గుణ శీలుని శరణుకోరగ
బిరబిర వేగమే రారండి ||తండ్రి||
2. శ్రీకర శుభకర శుభ చరణములే
ఈ ధరాతలమున కృపావరములే ||2||
సృజన నేత్రాలతో-సకలలోకాలనే
సంరక్షించే సద్గురుని చేర బిరబిర
వేగమే రారండి ||తండ్రి||