Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: unknown
ప. తండ్రి నా సర్వమును సమర్పింతును
నే జీవించు కాలమంత నీకే సొంతము ||2||
సమర్పింతును సమర్పింతును ||2||
నా తనువు, మనస్సు
ఆత్మను సమర్పింతును ||2||
1. నా మనస్సును హృదయమును
నీకే అర్పింతున్
కపటము లేక దాన్ని కాపాడుమా ||2||
హృదయ వాంఛలన్నియు అర్పింతును
నిర్మలం, నెమ్మదితో నన్ను నింపుమా ||2||
సమర్పింతును సమర్పింతును ||2||
నా తనువు, మనస్సు,
ఆత్మను సమర్పింతును ||2||
2. లోకం ఒసగు ఘనతను తృణీకరించితిని
నా యేసునే వస్త్రముగా ధరించుకొంటిని ||2||
బేధ భావాలన్నియు సమర్పింతును
ప్రామాణిక జీవితం నాకు ఒసగుమా ||2||
సమర్పింతును సమర్పింతును -
నా తనువు మనస్సు ఆత్మను సమర్పింతును