Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 2
ప. తండ్రి ఉన్నాడు మన తండ్రి ఉన్నాడు
ఇక్కడే ఉన్నాడు మనమధ్య ఉన్నాడు
జీవిస్తున్నాడు ప్రేమిస్తున్నాడు
లాలిస్తున్నాడు నడిపిస్తున్నాడు
నిన్ను చేతులతో ఎత్తుకున్నాడు
తన ప్రేమంతా నీదేనన్నాడు
లాలాల ల్లల్లలా ||2||
1. కష్టం, నష్టం, క్షామం,
కరువు నిన్ను బాధించగా
భయము, భీతి, పాపం
మోసం నిన్ను శోధించగా ||2||
ఎన్నడూ మరువకు తండ్రి ఉన్నాడు ||2|| ||జీ||
2. రోగం, యుద్ధం, భూతం, హింస,
నిన్ను వేధించగా
దు:ఖం, దురితం, ద్వేషం స్వార్ధం
నిన్ను పడద్రోయగ ||2||
ఎన్నడూ మరువకు తండ్రి ఉన్నాడు ||2|| ||జీ||