Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. తరలిరారే తండ్రి విందుకు
తనివి తీరగ భక్తులారా
కదలిరారె తండ్రి పొందుకు
తల్లడిల్లిన బిడ్డలార
ఆ...ఆ...ఆ...ఆ.. ||త||
1. ప్రేమకు ప్రతిరూపుడు
నిజప్రేమకే నిలయుడు
పాపశాపము బాపగ
ఇల ప్రాణమిచ్చిన దేవుడు ||2||
ఆర్తితోనిను పిలువగా ||2||
కదలిరారే భక్తులారా ఆ...ఆ...ఆ.. ||త||
2. శాంతమూర్తి ఏసువే
శాంతి సదనము ఆయనే
శాంతి జలముల చేతనే
మనసేద తీర్చిన దేవుడు ||2||
ప్రేమతో నిను పిలువగ ||2||
తరలిరారే భక్తులార ఆ...ఆ...ఆ.. ||త||