Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసే నా గానం-2
ప. తరతరాలనుండి యుగయుగాలవరకు
తరగని నీ ప్రేమను మాపై కురిపించుచు
పరలోకమునుండి దిగివచ్చిన దివ్యసత్ప్రసాదమా
ప్రభు యేసు దివ్యదేహమా
ఓ దివ్య సత్ప్రసాదమా
ప్రభుయేసు దివ్యదేహమా ||2||
నీవే జీవిత విందు
నీవే ప్రేమ విందు
నీవే పరలోకము విందు
అమరమైన అద్భుత విందు ||త||
1. అలనాడు ఎడారిలో ఆకలి గొన్నవారికి ||2||
మన్నాను కురిపించి నీవు మనసారా
నీ ప్రేమను చాటినావు ||2|| ||నీ||
2. ఈనాడు దివ్యపూజలో ఆకలితో
ఉన్న భక్తులకు ఆహారమై నిలిచి నీవు
శాశ్వత ప్రేమను చవి చూపినావు ||2||