Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ఆ....ఆ....ఆ....ఆ....
తరతరముల బలి సూచనగా
తన దేహంబును బలిచేసి ll2ll
మానవ ప్రేమకు సూచనగా
సత్ప్రసాదమునేర్పరచెన్ ll2ll
లోకొన ఎల్లరు రారండి ll2ll ll తర ll
1.
సర్వము సృష్టించే నాయనయే
ఎల్లర రక్షకుడాయనే ll2ll
ఆయన ధ్యానము లేకున్నా
గమ్యము మనకిక లేదింక ll2ll ll తర ll
2.
హృదయము నుండి మనమంతా
పాపాలన్నీ తొలగించి ll2ll
పరిమళ శుద్ధి హృదయంతో
ప్రభువును గైకొన రారండి ll2ll ll తర ll