Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తరలి రారండి ప్రభువిందు కొరకు -
తనివి తీరంగా లోకొందమండి
ఈ జీవవిందు మనకై వెలసెనండి -
ఆ ప్రేమ తీరాల దరిజేర్చునండీ
1. మమతానురాగాల ప్రతిరూప మీరూపు -
మనుజాళి హృదినింపు ఈ విందు
పరలోక ప్రేమంత అపురూప అర్పణగ -
భువియందు వెలసింది ఈ విందు
అమరలోకాల శుభవేదనాదం -
అప్పరూపాన యిల వెలసెనండి
ఆ ప్రేమ తీరాల దరిజేర్చునండి
2. పరలోక భూలోక ప్రేమానురాగాల
నిజమైన శుభమైన ఈ విందు
సత్యము జీవము ఒకటై వెలసిన
పావన రూపము ఈ విందు
3. ఈలోక పాపాలు - భరియించి హరియింప -
మన తండ్రి వాగ్దాన మీ విందు
పాతాళ ద్వారాలు విజయించి ఉదయించ -
పరలోక మకరంద మీ విందు