Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. తిరునామకీర్తన పాడని యెడల
నాలుక నాకెందుకునాధా
దేవా నీమహిమను స్తుతించని
యెడల అధరాలు ఎందుకు నాధా
ఈ జీవితం ఎందుకు నాధా...
1. వేకువ ఝామున - ఆకాశ పక్షులతో
నీ మహిమలను పాడెదము
చల్లని గాలితో తెల్లని మంచుతో
ఏకీభవించి నేపాడ ||తి||
2. ఆకాశతారల కాంతిని
చూచి ఆనందంతో - పాడెదము
ఆఖరిదినమున
మీరాకజూచి ఆహ్లాదముతో పాడ ||తి||