Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
తీసికో ప్రభు కానుక - జీవితం యిది నీదిక
ఏలుకో ప్రభు నన్నిక - కొలుచుకొందును నిన్నిక
1. నీలి సంధ్యల నీడలో - వెండి మబ్బుల జాడలో ||2||
నీ కరుణకు నోచుకొంటిని - నీ పిలుపును వింటిని నిన్ను నే కనుగొంటిని ||2||
2. ఎన్ని నాళ్ళుగ వేచితి ఇన్ని నాళ్ళుగ చూచితి ||2||
ఈనాడది తీరెను - చెరిగిపోనిది బంధము నిలుచును కలకాలము