Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప, యావే దేవుడు ఆనాడిచ్చెను
మన్నా భోజ్యముగ
యావె కుమారుడు
ఈ నాడిచ్చెను తననే భోజ్యముగ ||2||
1. మన్నా వలన మన్నన లేదు
మనుజులకీ భువిలో ||2||
పరమన్నా ఇచ్చును
మన్నన మనకు పరమును చేర్చుటలో||2||
2. ఐక్యము నొంద ఆయనయందు
దివ్య భోజ్యములో సఖ్యత నిచ్చుచు ||2||
సాక్షుల జేయును ఆయన సన్నిధిలో ||2||
3. పొందుడి మీరు నాదగు
దేహంఅప్ప రూపములో
అనుచును ప్రభువు
రుధిరంభిచ్చెన రసపు రూపములో ||2||
4. రాజుని విందే రోగపు మందు
పాపుల కిలయందు ||2||
రోజును విందులో కలుసుకో ప్రభుని
కనులకు విందగును. ||2||