Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
జ.యావే దేవుండా ఓ యావే
ప. యావే దేవుండా ఓ యావే దేవుండా
నీ మందిరంబున ఎవ్వడు నివసించు
నీ పర్వతంబున ఎవ్వడు నిలచుండు ||2||
1. నిందారహితుండైన నీతిమంతుడు
ధర్మమును పోషించెడి ధన్యజీవుండు ||2||
సత్యంబును పలికెడి సాధుశీలుండు
మందిరంబున నివసించుచుండు ||యా||
2. కొంచెంబులు చెప్పనట్టి మంచి మనుష్యుండు
ఆడులెన్నడు తల్వనట్టి నిష్కల్మషుండు
అపదూరుల్ మోపనట్టి దైవ భక్తుండు
నీ మందిరంబున నివసించుచుండు ||యా||