Lyrics/Tune/Prod: Fr. Jeevanbabu P
Music: Naveen M
Album: యేసే నా ఆశ - 8
యేసయ్య నా దేవుడు - నే నెవ్వరికి లొంగను (2)
యేసయ్య పేరులో - యేసయ్య శక్తిలో
యేసయ్య మాటలో - నే దాగొందును (2)
లోకమునకుగాని - శరీరమునుగాని
దెయ్యమునకుగాని -నే లొంగను లొంగను లొంగను ||యేస||
1. ఆదాము శోధనకు లొంగిపోయెను - యేస్సయ్య శోధనను జయించెను (2)
యేస్సయ్య మాటమీద నమ్మకమున్నది - సైతాన్ని నేనుకూడా ఓడిస్తానని (2) ||లోకము||
2. దావీదు శరీరమునకు లొంగిపోయెను - యేస్సయ్య శరీరమును జయించెను (2)
యేస్సయ్య మాటమీద నమ్మకమున్నది - వాంఛలను నేనుకూడా ఓడిస్తానని (2) ||లోకము||
3. సలోమోను లోకమునకు లొంగిపోయెను - యేస్సయ్య లోకమును జయించెను (2)
యేస్సయ్య మాటమీద నమ్మకమున్నది లోకమును నేనుకూడా ఓడిస్తానని (2)