Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసయ్య నా దైవమా
నా మీద దయచూపుమా
జీవ ఊటయైన నిన్నే మరచితిని
నేను ఎండి పోయితిని
నన్ను జీవింప చేయుమయా
1. ముళ్ళ కిరీటమును
అయ్యా నా కోసం ధరించితివి
రక్త ధారలను అయ్యా
నా కోసం చిందితివి ||2|| llయేll
2. నీవు పొందిన దెబ్బలచే
నా గాయములను స్వస్థ పరచితివి
నీవు చిందిన రక్తముచే
నా పాపములను కడిగితివి ||2|| llయేll