Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన గొరియ పిల్లను
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను
1. నా చేతుల సంకెళ్ళు పడినవి
నా రాతలు చెరిగిపోవుచున్నవి
నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తలదించుకున్నవి
2. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
నా తలంపులు ఏడుస్తున్నవి
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్తసిక్తమైనవి