Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసుని రక్తం కృపగల రక్తం - కల్వరి గిరిలో కార్చిన రక్తం
నీకై నాకై కార్చిన రక్తం - యేసుని రక్తం మన యేసుని రక్తం ll 2 ll
1 వ చరణం..
పరిశుద్ధ స్థలమును - చేధించిన రక్తం
పాపినైన నన్ను - కడిగివేసిన రక్తం
మనుజుల కొరకై - బలియైన రక్తం
సాతాను చేష్టలను - బంధించిన రక్తంllయేసునిll
2 వ చరణం..
బలహీనులను - బలపరిచిన రక్తం
పరలోక తండ్రితో - సంధించిన రక్తం
భువి అంతట - సాక్షిగ మార్చి
లోకానికి వెలుగై - నిలిపిన రక్తంllయేసునిll