Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యేసయ్యా నాహృదయ
స్పందనా నీవే కాదా
విశ్వమంత నీనామము
ఘననీయము విశ్వమంత
నీనామము గణనీయము
1. నీవు కనిపించని రోజున
ఒక క్షణము ఒక యుగముగా
మారెనే నీవు నడిపించిన రోజునా
యుగయుగాల తలపు మదినిండెను
2. నీవు మాట్లడని రోజు
నాకనులకు నిదురా కరువైయేనే
నీవు పెదవి విప్పిన రోజునా
నీ సన్నిధి పచ్చిక బయలైయేనే
3. నీవు వరునిగా విచ్చేయువేళ
నాతలుపులపంట పండునే
వధువునై నేనుచేరగా యుగ
యుగాలుగా నన్నేలుకొందువనే