Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసయ్యా నా ప్రాణ ప్రియుడా -
నీకే చెల్లింతును కృతజ్ఞతా ప్రార్థన ||2||
నీవు లేకుండా ఏమి చేయలేనయా-
నీవే నాకు ఆధారమయ్యా ||2||
1. ఇన్నేళ్ళ ఈ జీవితం యేసు నీ ప్రేమ ప్రసాదితం
నీ కృపను పొందుటయే నా ధన్యత-
నీ సేవ చేయుటయే నా బాధ్యత
కలలోనైనా నేను నీతోనే ఉండాలి
కలకాలం నీతోనే నే నైక్యమవ్వాలి
2. నిండైన నీ సన్నిధి యేసు నా జీవ నాధారము
నీ స్పూర్తితోనే జీవించెదను -
నీ చిత్తము ఎల్లప్పుడూ నెరవేర్చెదను ||కలలో||