Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసయ్యా నీ నామం నా ధ్యానము
యేసయ్యా నీ వాక్యం నా దీపము
పసిపాపవలె ! నీదు ఒడిలో
వసియించెదనూ! చిరకాలములు ||యేసయ్యా||
1. గాలివానలో వెలిగే దీపం ఆరునూ
నీ ప్రయాణములో నాదు దీపం ఆరదూ
నీ మాటలే నా జీవం-నీ వెలుగే నా దీపం
నీ గానమే నా పానం
నీ రూపమే నా ప్రాణం ||యేసయ్యా||
2. విశేష ఆరాధన ఏకం నీకే నా ప్రభూ
అపూరూప భావాలతో రాగం నీకే అంకితం
నీ పరలోకం చూడాలని
నీ దర్శనమునే పొందాలని
నీ స్వరమే వినాలని
ఆశించెద ప్రతి క్షణము ||యేసయ్యా||