Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: నేనే మార్గము
ప. యేసయ్య నీ వాక్యము నా త్రోవకు దీపము
ఆదియును అంతమును సర్వము నీ వాక్యము
మార్గమును సత్యమును జీవము నీ వాక్యము ||2||
1. ఎండిపోయిన బ్రతుకులకు జీవమిచ్చును నీ
వాక్యము బండ గుండెను కరిగించి రాగాలు
పలికించు నీ వాక్యము ||2||
నీ వాక్య ప్రేరణలో మము నిలుపుమా
నీ ప్రేమ మార్గములో మము నడుపుమా ||2|| ||యే||
2. అంధకారపు లోయలలో
వెలుగునిచ్చును నీ వాక్యము
అలసి సొలసిన మనసులకు
ఊరటనిచ్చును నీ వాక్యము ||2||
నీ వాక్య ప్రేరణలో మము నిలుపుమా
నీ ప్రేమ మార్గములో మము నడుపుమా||ఆ||