Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసయ్య నీ వాక్యము
నా త్రోవకు దీపము ||2||
ఆదియును అంతమును
సర్వము నీ వాక్యం
మార్గమును సత్యమును
జీవము నీ వాక్యం ||2|| ||యేసయ్య||
1. ఎండిపోయిన బ్రతుకులకు
జీవమిచ్చును నీ వాక్యము
బండ గుండెను కరిగించి
రాగాలు పలికించు నీ వాక్యము ||2||
నీ వాక్య ప్రేరణలో మము నిలుపుమా
నీ ప్రేమ మార్గములో మము నడుప్రమా ||2|| ||యేసయ్య||
2. అంధకారపులోయలలో
వెలుగునిచ్చును నీ వాక్యము
అలసిసొలసిన మనసులకు
ఊరటనిచ్చును నీ వాక్యము ||2||
నీ వాక్య ప్రేరణలో మము నిలుపుమా
నీ ప్రేమ మార్గములో మము నడుప్రమా ||2|| ||యేసయ్య||