Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసయ్యా నీవే నా దైవము
యేసయ్యా నీవే నా స్వరము ||2||
పూర్ణ మనసుతో నిన్ను స్తుతియించెదను
పూర్ణశక్తితో నిన్ను సేవించెదను llయేసll
1 వ చరణం..
లోకమునకు ఉప్పుగా నన్ను పోల్చినావు
ఆ ఉప్పులోని సారముగా నీవై ఉన్నావు
నీవు లేక నేను రుచిని యివ్వలేను ||2||
నీవు రాకపోతే నేను అడుగువేయలేను ||2||
సారముగల ఉప్పుగా నన్ను మార్చుము
రుచికరముగ జీవించుట నాకు నేర్పుము
ఆ......... ఆ........ ఆ........ ఆ........
2 వ చరణం..
లోకమునకు దీపముగా నన్ను పోల్చినావు
ఆ దీపములో నూనెగా నీవై ఉన్నావు
నీవు లేక నేను వెలుగు పంచలేను ||2||
నీవు లేకపోతే నేను అడుగువేయలేను ||2||
నూనె గల దీపముగ నన్ను మార్చుము
నీ వెలుగు చూపుటకు నన్ను పిలువుము