Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసో... ఎంత వరాల మనసో...నీది
చిత్రాసిత్రాలుగా ఇన్నానయ్యా ఊసు
ప్రభువా హైలెస్సో...
నీ మహిమే హైలేస్సో ||2||
1. గాలి వానొచ్చి నడియేటిలోన
నావ అల్లాడగా...నీవే కాపాడి నావే
కంట జూడంగా గాలాగిపోయే
అలలే సల్లారెనే... మహిమ సూపించినావే
నిన్ను పొగడంగ నేనెంత వాడ
నీటి మడుగుల్లో సేపంటివాడ
నా దారి గోదారిలో...బ్రతుకే హైలేస్సో
యేసో...పలికే నీ దాసో...
||యేసో...ఎంత వరాల||
2. దిక్కులేనట్టి దీనార్తులంటే నీవు
కురిసే దయా...నాడే తెలిసిందయ్యా
జంతుబలులిచ్చే మూఢాత్ములంటే నీలో
కలిగే సొదా...కరుణే ఎదజల్లగా
నీవే రేవంట ఏ నావకైనా...
నీవే కడలంట ఏ వాగుకైనా
ఉప్పొంగు నీ ప్రేమలో.. తడిసే హైలేస్సో..
మడిసే నీ దాసో..
||యేసో...ఎంత వరాల||