Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసుని చేరగ వేగ- పరుగిడ రా మానవుడా
పాపుల రక్షకుడేసు- రమ్మని తానై పిలిచే నిను ll యేసు ll
1 వ చరణం..
పాపములన్నో చేసి- శాపమునొందిన వారి
ఆశ్రయుడై తా నిలచి- బలియాయెను ఆ రాజుll యేసు ll
2 వ చరణం..
నిత్యజీవము కోరి- నీవరుదెంచిన చాలు
నీతి కిరీటము నీకు- నీటుగ దొరుకును నేడు ll యేసు ll
3 వ చరణం..
జీవాధిపతి ఏసు- జీవజలంబును ఇవ్వ
బలియాయెను మన కొరకై- ఘోరముగా స్లీవపై ll యేసు ll