Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యేసుక్రీస్తు మధురాహారం
మానవ జాతికి మమతాహారం
తరలిరండి కదలిరండి
దైవ జనమా ||2||
త్వరగా రండి ||2||
జీవమొసగే ఈ ప్రేమ శుభవిందుకు ||యే||
1. శాంతి సమతల సహన గుణాలై
సమర నినాదము
సోదర భావం దయగల హృదయమే
బ్రతుకు విధానము
మానవత్వమే మోక్షమార్గమని అమర పురికి
దారిచూపిన ||యే||
2. చీకటి బ్రతుకుల వెలుతురు పూవై
ఏసు ఉదయించెను
నడకలు నేర్పి వేదన మార్చి క్రీస్తు జీవించెను
స్వర్గ సీమకు ప్రేమమార్గమని
ప్రబోధించిన పావనాత్ముడు ||యే||