Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసు నాధుని స్థానములోమమ్మేలు- తండ్రికిజోహారు
కోటలు సైన్యము పోరులేక – గొర్రెల కాచెడు గొల్లవలె
మము ప్రేమతో నేలెడు గురుపుంగవా ||యేసు||
1:-
ప్రభు యేసు ప్రతినిధి యనగా మన పాపు రాయుని
ప్రఖ్యాతి ఏమి సత్యము ధర్మము బోధింతురు వారు
పొరపడకుండనే బోధింతురు శ్వేత – స్వర్ణ జండ వారిది
శాంతి పరిపాలన వారిది, వారి శిరంబున ముక్కిరీటం
మరి ముల్లోకము నేలు యేసు ప్రభువుగదా ||యేసు||
2:-
తహతహలాడు తరంగములైనను పేత్రుని పడవను ముంచవయ్యా
రాతి పునాదుల ఆలయము దుష్ట భూతముల్ –
గెలుచుట దుస్తరము
ఇహమున చేయు నిర్ణయము
పరలోకములోను చెల్లు సుమీ
ఆయురారోగ్యము తోడ తండ్రి మరి మరి మీకు జోహారు... ||యేసు||