Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యేసు నామం ఎంతో మధురం మధురం
క్రీస్తునామం మనకు శరణం శరణం ||2||
1. యేసుని ప్రేమ - ఎంతో విలువైనది
యేసుని ప్రేమ - ఎంతో లోతైనది ||2||
యేసుని ప్రేమ - ఎంతో వెలలేనిది
యేసునిప్రేమ - మనము కొనలేనిది||యే||
2. యేసుని ప్రేమ - మనకు ఓర్పునిచ్చును
యేసుని ప్రేమ- మనకు శాంతినిచ్చును||2||
యేసుని ప్రేమ - మనకు క్షమను ఇచ్చును
యేసుని ప్రేమ -మనకు వరము నిచ్చును ||యే||
3. యేసుని ప్రేమ - మనకు తపము నేర్పును
యేసుని ప్రేమ - మనకు జపము నేర్పును ||2||
యేసుని ప్రేమ - మనకు కరుణ చూపును
యేసుని ప్రేమ -మనకు కృపను చూపను ||యే||