Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
యేసు పిలిచెను - యేసు పిలిచెను
నిన్ను నన్ను తన - సన్నిధికి చేరపిలచెను ||2||
1 వ చరణం..
ఆది దేవుని ఆరాధించెదం - ఆత్మ భోజనం ఆరగించెదం
దేవ దేవుని దయను కోరి - ప్రభుని తలచెదం ||2|| llయేసుll
2 వ చరణం..
తప్పిపోయిన గొఱ్ఱెపిల్లను - దరికిచేర్చిన మంచి మేపరి
ఆదరించి అనుసరించి - అవని పొందను ||2|| llయేసుll
3 వ చరణం..
ఆది అంత్యము సృష్టికర్తను - జగము నేలెడి శాంతి దూతను
ప్రేమతోడ ఇహము వదలి - పరము చేరను ||2|| llయేసుll