Type Here to Get Search Results !

యేసు ప్రభుని పాద ( yesu prabhuni padha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Rev. Fr. Johnson Chettur 

Music: Kamalakar 

Album: నీరాజనం 


సా: పిత సర్వేశా... విశ్వవిధాత 

సుత సర్వేశా..జీపప్రదాత... 

పరిశుద్ధాత్మ వరగుణధామ. ||2|| 

త్రియేక దేవా త్రిలోక నేత 

పాహిమాం పాహిమాం పాహిమాం ||4|| 


ప: యేసు ప్రభుని పాదపూజకిది

శుభ సమయం 

హృదయ లయల మధుర శుృతుల 

సంధ్యారాగం 

పరలోక తండ్రికిదే మంగళ మేళం 

ఎదమీటి పాడెదం స్వాగతం గీతం ||2|| 

స్వాగతం స్వాగతం స్వాగతం ||యే|| 


1. కరుణామృతమును కురిపించేవు

ఈ దివ్య పూజలో 

సద్గుణ సిరులను అందించేవు నీ పాద సేవలో 

నా ఊపిరి నీవే నీ రూపం నేనే 

నా మనవి కాదనకా మన్నించుము దేవా

ప్రేమతో నిన్ను స్మరించేము ||2|| ||యే|| 


2. కన్యమరియ ఎదగుడిలో అపరంజి వెలుగై 

పరమును వీడి భువిపై వెలసిన ఓ ఏసుదేవా 

మానవాళి రక్షణకై కలువరి వేదికపై 

పాపులను మన్నించుటకై వరములు పంచుటకై 

సిలువపై కన్ను మూసినావు ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section