Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: జీవశృతి 7
పల్లవి:
- యేసుని వేడగ రారే ||2||
కరుణామయుడు ప్రేమ స్వరూపుడు
ప్రేమతో వేచియున్నాడుllయేసునిll
ఆది మధ్యాంత రహితుడు
సృష్టి స్థితి లయ కారకుడు
యేసువే యేసువే యేసువే llయేసునిll
1 వ చరణం..
నేనే, మార్గము సత్యమని
జీవజలము నేనెయని
నేనే జీవాహారమని ll 2 ll
నా రక్తము పానము చేయుడని
అని నుడివిన ప్రభు యేసువు- ఆర్తితో మనకై వేచెను
వేగమే యేసుని చేరగరారే llయేసు నిll
2 వ చరణం..
ఇరువురు లేక మువ్వురు- నా నామమున ప్రార్థించిన
వారి మధ్యన ఉందును- నే వారినే దీవింతును
అని నుడివిన ప్రభు యేసువు-ఆర్తితో మనకై వేచెను
వేగమే యేసుని చేరగరారే llయేసు నిll