Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యేసు యేసు నీచమైన ఈ పాపిపై
చూపిస్తున్నావా ఇంత దయా
ఎందుకయ్యా యేసయ్యా
ఎందుకయ్యా ఇంత దయ ||యే||
1. పాపము యొక్క వేతనం మరణం ||2||
నా పాపం నా వెంటనే వచ్చును ||2||
కనుకనే నా కోసం ఏడ్చితివా
తండ్రి నా బిడ్డలను మన్నించమని
కల్వరిలో ఏడ్చితివా-నాకోసమే ఏడ్చితివి | ||ఎందు||
2 నిన్ను వదలి వెనుకకు తిరిగి ||2||
నీ శక్తిని కోల్పోతిని ||2||
కనుకనే నా కోసం ఏడ్చితివా
దాహంతో నేనున్నానని
నా ఆత్మ కోసం ఏడ్చితివా ||2|| ||ఎందు||