Lyrics: Fr. Johnson Chettur
Tune: unknown
Music: K Ramachaari
Album: స్వర కమలం
ప. యేసుదేవా దీనబాంధవా ప్రాణనేస్తమా
నా సమస్తమా ||2||
నీవులేని ఈ క్షణం నాకు ఓయుగం ||2||
నీతో గడిపిన ప్రతినిమిషం
ఈ లోకమే సుమధుర స్వర్గం ||యే||
1. కడలిలోన మునిగిపోయే
పడవలాంటి బ్రతుకు నాది
భ్రమలలోనే మురిసి పోయే ఎండమావి ||2||
మనసునాది శాంతిలేని జీవితాన
కరుణజూపి ప్రేమ పంచి
కలతతీర్చి శాంతి నొసగే
నా కన్న తండ్రి ||నీతో|| ||2|| ||యే||
2. వెలుగులేని దారివెంట
అడుగుపడని బాటసారిని
తెలివిలేని అహముతోటి
బ్రతుకు నేడు చీకటాయె ||2||
నీడలేక వాడిపోవు
జీవలతకు పొదుచేసి
నీరు పోయు తోటమాలి
నీకు వందనం నీతో గడిపిన ||యే||