Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప యేసుతో ఠీవిగాను పోదమా
అడ్డుగా వచ్చువైరి గెల్వనూ
యుద్ధ నాదంబుతో పోదమా
1. రారాజు సైన్యమందు చేరనూ
ఆరాజు దివ్య సేవ చేయనూ
యేసు రాజు ముందుగా
ధ్వజము పట్టి నడువగా
యేసుతో ఠీవిగాను వెడలను ||యే||
2. విశ్వాస కవచమును ధరించుచు
ఆరాజు నాజ్ఞమదిని నిలుచూ
అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై
యేసుతో ఠీవిగాను వెడలను ||యే||
3. శోధనలు మనల చుట్టి వచ్చినా
సైతాను అంబులెన్ని తగిలినా
భయములేదు మనకిక
జేసు చెంత నుందుము
యేసుతో ఠీవిగాను వెడలనూ ||యే||
4. ఓ యువతి యువకులారా చేరుడీ
శ్రీ యేసురాజు వార్త చాటుడీ
లోకమంత ఏకమై లోకనాధగొల్వనూ
సాధనంబెవ్వరూ నీవే నేనెగా ||యే||