Lyrics/Tune/Music/Prod: Fr. Lamu Jayaraju
Music: Naveen M
Album: ఆలకించుమో దేవా
ప. యేసుని చరితం వినరండి
ఆయనప్రేమను కనరండి ||2||
ప్రేమను పంచిన దేవుని ||2||
రక్షణ భాగ్యం పొందండి ||2||
హల్లెలూయా.....హల్లెలూయా....
హల్లెలూయా...హల్లెలూయా... ||2|| ||యే||
1. యావే దేవుని స్వరము
ప్రేమే ఆయన బోధనం
పీడిత జనులకు అండగా ||2||
భువిపై వెలసిన అనురాగం ||హ||
2. ఆదిలో వెలసిన నీ వాక్కే
అద్భుత రీతిగ ఇల నిలిచే
సత్యము మార్గము జీవమై
శాంతి రాజ్యమును స్థాపించే ||హ||