Type Here to Get Search Results !

యేసుని శరీరము మనకు ( yesuni shariramu manaku Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


యేసుని శరీరము మనకు నిత్యాహారము

యేసుని రక్తము మనకు నిత్యపానము

ఆశతో రారే ఆరగింపరే ప్రార్ధింపరారే ముక్తినొందగ


1 వ చరణం.. 

ఎడారిలోమన్నాఅనెడి దివ్యాహారము

ఐదువేలమందికి ఆకలి తీర్చిన ఆహారం

రోగులకు ఔషధమైనది ఈ ఆహారం

అంధులకి నిత్య వెలుగైనది ఈ ఆహారం

ప్రభు విందును లోకొనరారే ఓ క్రైస్తవ సంఘమా 

ఆశతో రారే... ఆరగింపగా

ప్రార్ధింప రారే... ముక్తి నొందగా ||2|| ll యేసు ll 


2 వ చరణం.. 

పాపులను పవిత్రుల చేసిన ఆత్మాహారము

అనాధలకు ఆదరణ చూపిన ప్రేమాహారము 

కష్ఠాలలో కన్నీరు తుడిచిన ప్రేమాహారము

అశాంతిలో శాంతినిచ్చిన ఆత్మాహారము

ప్రభువిందును లోకొనరారే ఓ క్రైస్తవ సంఘమా 

ఆశతో రారే... ఆరగింపగా

ప్రార్ధింప రారే... ముక్తి నొందగా ||2|| ll యేసు ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section