Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యేసుని స్నేహమే మధురమే
మధురమే మధురమే
క్రీస్తుని స్నేహమే మధురమే
మధురమే మధురమే
1. నాయాత్మ కాపరి నాధుడవే
నా యండగా నుండగా వచ్చితివే ||2||
శోధనలో, వ్యాధులలో
బాధలలో బ్రోచితివి ||2||
నిత్య స్వరూపి నీ సన్నిధిలో
నిరతము నడుపుము నీ నీడలో
2. దైవ యానతి దీప్తిలో
దివ్య యాగమును దీర్చితివి
కల్వరిపై, సిలువలో,
రక్తంచింది, రక్షించితివి
నా కొరకెంతో త్యాగము చేసి
ప్రాణము నిచ్చిన ప్రభు నీవే
3. మారదు నీ ప్రేమ మారదు
మాన్యుడు నీ ప్రేమ మారదు
నే పాడెదన్, ఈ గీతమున్,
మోక్షపురి మార్గంబున
నీదు దర్శన భాగ్యంబులోన
నా యాత్మ సాఫల్య సౌభాగ్యమే