Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యేసుని వాక్యం - వినరే జనులారా ll 2 ll
పరిశుద్ధని జీవం - కనరే ప్రజలారా ll 2 ll
1 వ చరణం..
ఒక మాటతో వెలుగొందెను - దేవుని సృష్టినాడు
ఆ వాక్యమే నరరూపుడై - మాటాడ ఏతెంచె నేడు
మనసులతో మాటాడును - మన ప్రభువు యేసు
ఆలించి పాలించుదాం ప్రభు మాటను పాటించే -
జీవితమె ధన్యం ప్రభు బాట పయనించుదాం
ప్రభు వేదమే మనకు ..... జీవదాయకం .....llయేసుll
2 వ చరణం..
పోటెత్తిన కడలిని తానే - శాసించె నిలిపిన వాక్యం
మరణించిన మనుజుల తాకి - జీవం పోసిన వాక్యం
గురువులను దీవించి - వరము లొసగు వాక్యం
యేసు రక్షణ వేదం పీడిత జనులందరికి -
ముక్తి నొసగు వాక్యం లోక విమోచక వేదం
ప్రభు వేదమే మనకు..... మోక్ష సాధకం ......llయేసుll