Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యెహోవా మా కాపరి-యేసయ్యా మా ఊపిరి
మాకు లేనిదే లేదు - లేమి కలుగదు ||2||
యెహోవా మా కాపరి-యేసయ్యా మా ఊపిరి
1. వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను
ఆత్మ జనంలో దప్పిక తీర్చెను ||2||
మా ప్రాణము సేదదీర్చేను
నీతి మార్గమున నడిపించెను ||2|| ||యెహోవా ||
2. కారుచీకటిలో కన్నీరు తుడిచేను
మరణపడకలో ఊపిరి పోసేను ||2||
మా తోడునీడై నిలిచి నడిచెను
శత్రుపీఠమున విందు చేసెను ||2|| ||యెహోవా ||
3. పరిశుద్ధ ఆత్మలో ముంచి వేసెను
పరమానందము పొంగిపోయెను ||2||
పరలోకములో గొర్రెపిల్లను నిరతం
మేము కీర్తింతుమూ ||2|| ||యెహోవా ||