Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యెహోవా నీ నామము
ఎంతో బలమైనది ఎంతో బలమైనది
1. మోషేనిను ప్రార్ధింపగా
మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్దింపగా
సూర్య చంద్రులనాపితివి ||యె||
2. నీ ప్రజల పక్షంబుగా
యుద్దములు చేసిన దేవా
అగ్నిలో పడవేసిన
భయమేమియు లేకుండిరి ||యె||
3. సింహాల బోనైననూ
సంతోషముగా వెళ్ళిరి
ప్రార్థించిన వెంటనే
రక్షించె నీ హస్తము ||యె||
4. చెరసాలలో వేసినా
సంకెళ్ళు బిగించినా
సంఘము ప్రార్థించగా
సంకెళ్ళు విడిపోయెను ||యె||
5. పౌలు సిలను బంధించి
చెఱసాలలో వేసిన
పాటలతో ప్రార్థింపగా
చెఱసాల బ్రద్దలాయెను ||యె||
6. మానవుల రక్షణ కొరకై
నీ ప్రియ కుమారుని
లోకమునకు పంపగా
ప్రకటించే నీ వాక్యము ||యె||