Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. యెహోవా నాకు వెలుగాయె
యెహోవా నాకు రక్షణయే
నా ప్రాణ దుర్గమయ్యె
నేను ఎవరికి ఎన్నడు భయపడను
1. నా తల్లియు నా తండ్రియు ఒక వేళ విడచినూ
ఆపత్కాలమున చేయి విడువకనూ
యెహోవా నన్ను చేరదీయును ||2|| ||యే||
2. నా కొండయు-నా కోటయు
నా ఆశ్రయము నీవే
నేను ఎల్లప్పుడు ప్రభు సన్నిధిలో
స్తుతి గానము చేసెదను ||2|| ||యే||
3. నాకు మార్గమును ఉపదేశమును
ఆలోచన అనుగ్రహించి
నీ ఆజ్ఞలలో జీవించుటకు
కృపతో నన్ను కాపాడుము ||2|| ||యే||