Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
యెహోవా నా బలమా ` యదార్ధమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం ` యెహోవా
1 వ చరణం..
నా శత్రువులు నను చుట్టినను
నరకపు పాశము లరికట్టినను
వరదవలె భక్తిహీనులు పొర్లిన
వదలక నను ఎడబాయని దేవాllయెll
2 వ చరణం..
మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
తన ఆలయములో నా మొరవినెను
అదరెను ధరణి భయకంపముచే llయెll
3 వ చరణం..
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగ చేయున్
జలరాసులనుండి బలమైన చేతితో
వెలుపల జేర్చిన బలమైనదేవుడుllయెll
4 వ చరణం..
పౌరుషముగల ప్రభుకోపించెగ
పర్వతముల పునాదులు వణికెను
తన నోటనుండి వచ్చిన అగ్ని
దహించి వేసెను వైరుల నెల్లన్ llయెll
5వ చరణం..
మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తనమూటుగ జేయున్
ఉరుములు మెరుపులు మెండుగజేసి
అపజయమిచ్చును అపవాదికినిllయెll
6వ చరణం..
దయగ వారిపై దయచూపించును
కఠినుల యెడల వికటము జూపును
గర్విష్ఠుల యొక్క గర్వము నణుచును
సర్వము నెరిగిన సర్వాధికారిllయెll
7వ చరణం..
నా కాళ్లను లేడి కాళ్ళగ జేయును
ఎతైన స్థలములో శక్తితో నిలిపి
రక్షణకేదెము నాకందించి
అక్షయముగ తనపక్షము చేర్చిన llయెll
8వ చరణం..
యెహోవా జీవము గలదేవా
బహుగా స్తుతులకు అర్హుడు నీవు
అన్వజనులలో ధన్యతజూపుచు
హల్లెలూయ స్తుతిగానము జేసెద llయెll