Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
యుగ యుగాల నిరీక్షణ ఈనాటికి ఫలించెను
అదిగో ఉదయించెనట లోక రక్షకుండు ||2||
దర్శింప పోదాము వేగము రారే వేగము రారే llయుగll
1 వ చరణం..
వేగుచుక్క మాకు వెలుగుదారి చూపే -
వెంటబెట్టు కొచ్చి నీ చెంతను నిలిపే ||2||
సువర్ణాల పూజ నీకు సుందర నయానా
బంగారము చేయుమయా మా మనస్సులను
మమతలు పండింపచేయు మనిషి మనిషిలోను llయుగll
2 వ చరణం..
వేదనలను మరచి కష్టాలను ఒరసి -
కరుణామయుడొచ్చెన్న వార్త మాకు తెలిసి ||2||
చెడును దుంచి తెంచమనిన మంచిని జగతి
సాంబ్రాణి ధూపాలను సమర్పించినాము
సాగిలపడి మ్రొక్కినాము సాతాను మర్థనా llయుగll
3 వ చరణం..
ఎంతకాలమైనా మారని ఈ నరుల -
మనసు కడగాలని ఇలకు వచ్చినావో ||2||
దైవస్తుతుడ పరలోక తండ్రి తనయుడా
ఇదిగో మా సమర్పణ సుగంధాల పరిమళం
మనిషి మనిషిలోను ప్రేమ పరిమళాలు పంచవయా llయుగll