Song Lyrics in Telugu
అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు
ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చేరోజు
1. వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలేరోజు
నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు
ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు
2. సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు
భూకంపం కలుగే రోజు దిక్కులేక అరిచే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు
3. మిడతల దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు
కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు,
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు
4. వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్లు మసలే రోజు
అబద్ధికులు అరిచేరోజు దొంగలంతా దొరిలే రోజు
ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు
5. పిల్ల జాడ తల్లికి లేదు తల్లి జాడ పిల్లకులేదు
చెట్టు కొకరై పుట్ట కొకరై అనాధలై అరిచే రోజు
ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు
6. ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నాదో
బలము చూచి భంగ పడకుమా ధనము చూచి దగా పడకుమా
ఆ రోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు
Song Lyrics in English
Athe Athe Aa Roju Yesayya Ugrata Roju
Edenla Shramala Roju Paapulanta Eedche Roju
1. Vadagandlu Kurise Roju Bhoomi Saghm Kaale Roju
Nakshatramulu Raale Roju Neeru Cheddu Ayye Roju
Aa Neeru Sevichina Manushulanta Chachche Roju
2. Sooryudu Nalupaiye Roju Chandrudu Erupaiye Roju
Bhookampam Kaluge Roju Dikkulaeka Ariche Roju
Aa Roju Shram Nundi Tappinche Naadhudu Ledu
3. Midatala Dandochche Roju Neeru Rakthamayya Roju
Kopagni Ragile Roju Parvatamulu Pagile Roju,
Aa Roju Shram Nundi Tappinche Naadhudu Ledu
4. Vyabhicharulu Eedche Roju Moosagallu Masale Roju
Abaddhikulu Ariche Roju Dongalanta Dorile Roju
Aa Roju Shram Nundi Tappinche Naadhudu Ledu
5. Pilla Jaada Talliki Ledu Tallii Jaada Pillakuledu
Chettu Kokarai Puttu Kokarai Anaadhala Ariche Roju
Aa Roju Shram Nundi Tappinche Naadhudu
6. O Manishi Yoachimpavaa Nee Brathuku Ela Unnaado
Balamu Choochi Bhanga Padakuma Dhanu Choochi Daga Padakuma
Aa Roju Shram Nundi Tappinche Naadhudu Ledu