Song Lyrics in Telugu
సమయమిదే సమయమిదే సంఘమ సమయమిదే
సీయోనులో చేరుటకు సంఘమ సమయమిదే
చూడుము భూమి మీద పాప చీకటి క్రమ్మియున్నది
జ్యోతివలె జీవించు జీవవాక్యము పట్టుకొని ||సమయమిదే||
ధూళి దులుపుకొనుము నీ మెడ కట్లు విప్పుకొనుము
సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము ||సమయమిదే||
నిలువుము సత్యముకై సువార్తకు పోరాడుము
సేవను చేసి నీవు త్యాగం చేయుము ప్రాణమును ||సమయమిదే||
సీయోను శత్రువులు సిగ్గుపడుదురు నిశ్చయముగా
సీయోను నీ పరుగు తుదముట్టించుము త్వరితముగా ||సమయమిదే||
సీయోనులో వసించు సర్వశక్తుడు నీ ద్వార
శోధింప ఈ దినము మార్పునొందుము స్పటికముగా ||సమయమిదే||
పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభుయేసుతో
ప్రేమలోనే నిలువుము నిత్యజీవము చేపట్టుము ||సమయమిదే||
సీయోను రారాజు నిన్ను చూచి ఏతెంచెదరు
మహిమగల కిరీటం నీకు ఆయన ఇచ్చెదరు ||సమయమిదే||
Song Lyrics in English
Samayamide Samayamide Sanghama Samayamide
Siyonulo Cherutaku Sanghama Samayamide
Choodumu Bhoomi Meeda Paapa Cheekati KrammiYunnadi
Jyothivale Jeevinchu Jeevavakyamu Pattukoni ||Samayamide||
Dhooli Dulupokonu Nee Meda Katlu Vippokonu
Sundaraminavastaramu Vegam Dharinchi Siddhapadumu ||Samayamide||
NiluVumu Satyamukai Suvarthaku Poradumu
Sevanu Chesi Neevu Tyagamu Cheyumuu Praanamunu ||Samayamide||
Siyonu Shatrulu Siggupaduduru Nishchayamuga
Siyonu Nee Parugu Thudamuttinchumu Tvarithamuga ||Samayamide||
Siyonulo Vasinchu Sarvashaktudu Nee Dwara
Shodhimp Ee Dinamu Marpundundumu Spatikamuga ||Samayamide||
Pilupuku Taginattuga Neevu Nadumumu Prabhu Yesu To
Premalone NiluVumu Nityajeevamu Chepattumu ||Samayamide||
Siyonu Raaraaju Ninnu Chooche EthenchuTedu
Mahimagala Keereetam NeeKu Aayana Ichedu ||Samayamide||