Song Lyrics in Telugu
ఈ జీవిత ఈత ఈదలేకున్నాను - నా చేయి పట్టుకో నా యేసు నాధా
గాలి తుఫానులకు కలిగే తరంగముల కొట్టబడుచున్నాను గానా ...దేవా
1. సారహీనపు సంసారాబ్దిలోన సాగలేకున్నాను
సాయంబు రావా సార కరుణా రసధారల్ నొసగుము
సాగిపోవను ముందుకు శక్తిని నాకిమ్ము || ఈ జీవిత ||
2. సంఘ సంబంధముగ శాంతి లేకపోయె - సమానతత్వంబు సమసిపోయే
సోదరులే నాకు శత్రువులైరి - సమాధానము నొసగు సరుగున రావా దేవా || ఈ ||
3. బయట పోరాటములు భయపెట్టుచుండెను
భార్యా పుత్రాదులచే బాధలేన్నో కలిగే బాధలన్నియు బాయ బహు త్వరగా రావా || ఈ జీవితం ||
4. రాజ్యంబు పై రాజ్యంబు రంకె వేయుచుండే
రాష్ట్రము పై రాష్ట్రంబు రగులుచుండె - రాజులకు రాజువై రయముగ రావయ్యా
- రాజ్యమేలను త్వరలో రమ్ము రమ్ము || ఈ జీవిత ||
5. సైతాను చెలరేగే సమయంబిక లేదని
సింహంబు రీతి గర్జించుచుండె - సంకెళ్ళతో వచ్చి సైతానుని బంధించి
సమాధాన రాజ్యం స్థాపింప రావా || ఈ ||
6. మొదటి జామయ్యెను మీరింక రారయ్యే
రెండవ జామున జాడలేదే - మూడవ జామయ్యే మీరింక రాలేదే
- నాల్గవ జామున నడిచి వస్తున్నావా || ఈ ||
7. పెండ్లి కుమారుడు ప్రభువైన క్రీస్తుండు
పెండ్లి సంఘం ఆత్మయు పిలచుచుండెను
- పెండ్లి విందులో నేను పెండ్లి వస్త్రముతోను హల్లెలూయ యని పాడెదను || ఈ జీవిత ||
Song Lyrics in English
Ee Jeevitha Eetha Eedalekunnanu - Naa Cheyi Pattuko Naa Yesu Naadhaa
Gaali Tufaanulaku Kalige Tarangamula Kottabaduchunnanu Ganaa ...Devaa
1. Saaraheenapu Samsaraabdhilona Saagalekunnanu
Saayambu Raavaa Saara Karuna RasadhaaraL Nosagumu
Saagipovanu Mundhuku Shaktini Naakimmu || Ee Jeevitha ||
2. Sangha Sambandhamuga Shaanti Leakapoye - Samaana Tatwambu Samasipoye
SodhruLaa NaaKu ShatruvuLaiRii - Samaadhaanamu Nosagu Saruguna Raavaa Devaa || Ee ||
3. Bayata PoraaTaMulu BhayapettuchundeNu
Bhaaryaa PutraadiLache BaadhalaennO Kalige BaadhalaMmu Baaya Bahu Thvaragaa Raavaa || Ee Jeevitha ||
4. Raajyambu Pai Raajyambu Ranke Veyuchunde
RaashtRam Pai RaashtRambu Raguluchunde - Raajulaku Raajuvai Rayamuga Raayayaa
- Raajyamaelunu Thvaralo Rammu Rammu || Ee Jeevitha ||
5. Saitaanu Chelerage Samayambika Ledaani
Simhambu Reethi GarchinchuChunde - Sankellatho Vachchi Saitaanuni Bandhichi
Samaadhaan Raajyam Sthaapimpa Raavaa || Ee ||
6. Modati Jaamayyenu Meerinka Raaraaye
Rendava Jaamuna Jadalede - Moodava Jaamayye Meerinka Raaledhe
- Naalghava Jaamuna NadiChi Vastunnavaa || Ee ||
7. Pendli Kumaarudu Prabhavaaina KristeeTundi
Pendli Sangham Aathmayu Pilachuchundeenu
- Pendli Vindulo Nenu Pendli VasthramuthoHalleluyaa Yani PaadeDanu || Ee Jeevitha ||