Telugu Lyrics
ఎందుకో...నన్నింతగా నీవు
ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర
హల్లేలూయ యేసయ్యా - 2
నా పాపము బాప నర రూపివైనావు
నా శాపము బాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే - 2
నీ రూపము నాలో నిర్మించి యున్నావు
నీ పోలికలోనే నివశించమన్నావు
నీవు నన్ను ఎన్నుకొన్నావు - నీ కొరకై నీకృపలో - 2
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలుభరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చేర్చుకొన్నావు - నను దాచియున్నావు - 2
నా మనవులు ముందే నీమనసులో నెరవేరే
నా మనుగడముందే నీగ్రంధములో నుండే
యేమి అద్భుత ప్రేమ సంకల్పం - నేనేమి చెల్లింతు - 2
నీ చేతులతోనే నన్ను చేసి యున్నావు
నీ గాయములోనే నను దాచి యున్నావు
నీదు సేవను చేయుచున్నాను - నీ కొరకై జీవింతున్
Song Lyrics in English
Enduko...Nanninthaga Neevu
Preminchitivoo Devaa
Anduko Naa Deena Stuti Paathra
Halleluya Yesayya - 2
Naa Paapamu Baapa Nara Roopivainaa
Naa Shaapamu Baapa Naligi Vreeladitivi
Naaku Chaaleena Devudavu Neeve Naa Sthaanamulo Neeve - 2
Nee Roopamu Naalo Nirminchi Yunnavaa
Nee Poolikaloone Nivashinchemannaa
Neevu Nannu Enukonnavaa - Nee Korakai Neekrupaloo - 2
Naa Shramalu Sahinchi Naa Aashrayamainaa
Naa Vyadhalu Bharingi Nannadukonnavaa
Nannu Neelo Cherchukonnavaa - Nanu Daachiyunnavaa - 2
Naa Manavulu Mundhe Neemanasulo Nereveree
Naa Manugadamundhe Neegrandhamulo Nunde
Yemi Adbhuta Prema Sankalpam - Neneemi Chellinthu - 2
Nee Chethulothane Nannu Chesi Yunnavaa
Nee Gaayamuloone Nanu Daachi Yunnavaa
Needu Seva Cheyuchunnanu - Nee Korakai Jeevinthun