Telugu Lyrics
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే ప్రభువా ! (2)
నీ వాక్కుకై వేచి యుంటిని - నాప్రార్ధన ఆలకించుమా ! (2)
నీ తోడు లేక నీ ప్రేమ లేక -
ఇలలోనా ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవిపూవులే నీ ప్రేమ పొందగా (2)
నాప్రార్ధన ఆలకించుమా ప్రభువా -
నాప్రార్ధన ఆలకించుమా
"ఎన్ని"
నా ఇంటి దీపం, నీవేయని తెలసి -
నా హృదయం నీ కొరకు పదిల పరచితి (2)
ఆరిపోయినా నావెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా -
వెలిగించుము నీ ప్రేమతో
"ఎన్ని"
ఆపదలో నన్ను వెన్నంటి యున్న -
నాకాపరివై నన్ను ఆదు కొంటివి
లోకమంతయు నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చేయవు ప్రభువా -
నీ నుండి వేరుచేయవు
"ఎన్ని"
నా స్థితి గమనించి నన్ను ప్రేమించి -
నా కొరకై కలువరిలో యాగమైతివా
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీ యందే నిత్య జీవము ప్రభువా -
నీయందే నిత్య జీవము
"ఎన్ని"
Song Lyrics in English
Enni Thalachina Edi Adigina
Jaregedi Nee Chittame Prabuva! (2)
Nee Vaakkukai Vechi Yuntini - Naapraarthana Aalakinchumaa! (2)
Nee Thodu Lekha Nee Prema Lekha -
Ilolona E Praani Nilavaledu (2)
AdavipooVule Nee Prema Pondaga (2)
Naapraarthana Aalakinchumaa Prabuva -
Naapraarthana Aalakinchumaa
"Enni"
Naa Inti Deepam, Neveyani Thelasi -
Naa Hridayam Nee Koraku Padila Parachiti (2)
Aaripoyina Naaveliguu Deepamu (2)
Veliginchumu Nee Prematho Prabuva -
Veliginchumu Nee Prematho
"Enni"
Aapadalo Nannu Vennanti Yunna -
Naakapariwahi Nannu Aadu Kontivi
Lokamanthayu Nannu Vichachina (2)
Nee Nundi Veru Cheyavu Prabuva -
Nee Nundi Veru Cheyavu
"Enni"
Naa Sthiti Gamaninchi Nannu Preminchi -
Naa Korakai Kalavariilo Yaagamaitiva
Needu Yaagame Naa Moksha Maargamu (2)
Nee Yande Nithya Jeevamu Prabuva -
Nee Yande Nithya Jeevamu
"Enni"