Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. హల్లేలూయ
దేవుని రాజ్యము సమీపించెను
రండి రారండి రక్షణ పొందండి ||2||
హృదయ శుద్ధిని శాప విముక్తి ఒసగే
క్రీస్తుని నమ్మండి
రండి రారండి రక్షణ పొందండి ||4|| ||దే||
1. రాజులకు రా రాజు ఏసయ్య
భువిలో మనకై వెలసేనయ్యా ||2||
పాపిని ప్రేమించి పరమును విడిచి ||2||
పరిశుద్దాత్ముడు వచ్చేనయ్యా ||2|| ||ర||
2. అమృత ధారలు సాటిరావు
మణి మాణిక్యాలు సరిరావు ||2||
మారు మనసే విలువయినది ||2||
మరువక క్రీస్తున్ విశ్వసించండి ||2|| ||ర||