Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హోసాన్నా దావీదు సుతుడా !
హోసాన్న హోసాన్న హోసాన్నా ll 2 ll
ప్రభు నామమ్మున ఆగతుడా-ధన్యత
నీకే అగుగాక ఇజ్రయేలుల జననేత -
ఉన్నత పరమున హోసాన్నllహోll
ప.హెబ్రూబాలక బృందము కూడి -
కరకమలాల కొమ్మలు బూని ప్రభునకు
స్వాగతమిడ నెదురేగి - నినదము జేయుచు
పాటలుపాడి ఆనందోత్సవ గేయపు బాణి-
హోసాన్నయని మహోన్నతమున llహోll ll 2 ll
ప.వస్త్ర భూషిత రాజి పదాన - హెబ్రూ బాలక
పాళిముదాన నినదము చేయుచు నేగి బిరాన-
దావీదు సుతునకు హోసాన్న
ప్రభునామంబున వచ్చిన వారి-ధన్యతములనే
మధుర స్వరాన హెబ్రూ బాలక ........llహోll
1 వ చరణం..
భూమియున్ తత్ సంపూర్ణతయున్-
జనములు ధరణియు ప్రభు స్వగతంబుల్
ఏలన జలనిధి వేసిరి నాందిని-
జలములు దానిని స్థిరపరచిరిllహెll
2 వ చరణం..
గుమ్మములారా గదనుల దెరచి-సగర్వముగ సంసిద్ధముగండు
పురాతనమందు ద్వారములారా-
మహిమాన్విత ప్రభుపాదము మోపి llహెll
3 వ చరణం..
మహిమాన్వితుడీ ప్రభులెవరు-
రణశూరుడు బలశాలి ప్రభూ
పురాతనములగు ద్వారములారా-
మహిమాన్విత ప్రభుపాదము మోపి llహెll
4 వ చరణం..
పిత పుత్ర పవిత్రాత్మకున్-
స్తుతి మహిమంఋ కలుగునుగాక
ఆదినివలె ఇపుడెల్లపుడున్-
యుగయుగములు కలుగును గాకllహెll