Lyrics: Fr. Gnanam SDB
Tune: Fr. Gnanam SDB
Music: Naveen M
Album: ప్రణతులు -2
ప: హృదయ వేదన వినుమో స్వామి ||2||
నా హృదయ వేదనా వినుమోస్వామి
పాపమనే ఊబిలో చిక్కి శల్యమైనాను
మలినమైన మనస్సును క్షాళన చేయి ||2||
విడువకు నీవు నా చేయి ||2|| ||హృ||
1. అదుపులేని నోటితో మాట మీరితి
దుడుకు వాని రీతినే అనుసరించితి ||2||
తప్పులెరిగి నిన్ను నేను చేరుకొంటిని ||2||
కరుణించుమా ఈ దీనునీ ||2|| ||హృ||
2. భయభక్తులు విడనాడినా ద్రోహినైతిని
దోషములను లెక్కించిన నిలువనంటిని||2||
మంచు కంటే తెల్లగా మార్చుము తండ్రి ||2||
నీతి మంతుడా నీ దీవెనలీయి ||హృ||